ETV Bharat / city

'మంత్రి వెల్లంపల్లి, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్​లా తయారయ్యారు' - పోతిన మహేశ్ తాజా వార్తలు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్​లాగా తయారయ్యారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. రాష్ట్రంలోని ఆలయాలను మంత్రి వెల్లంపల్లి తనకు అనువుగా మార్చుకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో వెల్లంపల్లి అవినీతి, ఆక్రమణలు యథేచ్ఛగా సాగిస్తున్నారన్నారు.

'మంత్రి వెల్లంపల్లి, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్​లా తయారయ్యారు'

author img

By

Published : Dec 11, 2020, 4:49 PM IST

రాష్ట్రంలోని ఆలయాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తనకు అనువుగా మార్చుకున్నారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. దేవాలయాల ఆస్తులను బినామీల ద్వారా తన పేరు మీదకు మార్చుకున్నారన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో వెల్లంపల్లి అవినీతి, ఆక్రమణలు యథేచ్ఛగా సాగిస్తున్నారన్నారు.

"అవినీతితో మంత్రి సంపాదించిన ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటిపోయింది. రంగనాథ స్వామి ఆలయానికి చెందిన రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్​లాగా తయారయ్యారు. వన్​టౌన్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్న దేవాదాయశాఖకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. శేషమహల్ కనకవల్లి కాంప్లెక్స్​లో 40 షాపులను మంత్రి ప్రోద్భలంతో ఆయన బినామీలు ఆక్రమించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన గూడవల్లి, పోరంకి, యనమలకుదురు, ఉంగుటూరు ప్రాంతాల్లోని విలువైన భూములను మంత్రి అనుచరులు ఆక్రమించారు."

-పోతిన మహేశ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి

దుర్గగుడిలో మూడు సింహాల మాయం ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాలేదని పోతిన మహేశ్ అన్నారు. అవి మంత్రి ఇంట్లో క్షుద్రపూజలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలు బయటపడుతున్నా.. ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించటం లేదని మండిపడ్డారు. ఎక్కడా లేనివిధంగా దేవాదాయ భూములను ప్రైవేటు శాఖకు ఎలా అప్పగిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆస్తులు, ఆదాయం ఎక్కువగా వచ్చే దేవాలయాలకు మాత్రమే నిధులను కేటాయిస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీచదవండి

ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.