తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో పవన్ ప్రసంగంతో వైకాపా శ్రేణుల వెన్నులో వణుకు పుట్టిందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అందుకే వైకాపా అధిష్ఠానం మంత్రుల గుంపును తిరుపతి వీధుల్లో తిప్పుతోందని విమర్శించారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది వైకాపా నాయకులేనని ఆరోపించారు.
వివేకా హత్య కేసును ఛేదించి.. దోషులను శిక్షించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మహేష్ ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరిస్తారనే.. తిరుపతి ప్రచారానికి దేవాదాయశాఖ మంత్రిని దూరంగా ఉంచారని అన్నారు. పింక్ డైమండ్ విషయంలో కోర్టుకెళ్లిన రమణదీక్షితులుని విధుల్లోకి తీసుకోవడం.. దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న ఘనత.. వైకాపాకే దక్కిందన్నారు.
ఇదీ చదవండి:
8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు