స్థానిక సంస్థల ఎన్నికల్లో తమతో భాజపా కలిసి రాలేదని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. భాజపాతో పొత్తు వల్ల తమను మైనార్టీలు వ్యతిరేకించారని చెప్పారు. నాయకత్వానికి అన్ని అంశాలపై నివేదిక అందిస్తామని పేర్కొన్నారు.
భాజపాతో పొత్తు వల్ల... గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లోనూ ఓటమి చెందామని మహేశ్ ఆరోపించారు. భాజపా నాయకత్వం తమకు ఏ మాత్రం సహకరించలేదని ఆరోపించారు. భాజపా నేతలను సమావేశాలకు ఆహ్వానించినా ఎవరూ రాలేదని తెలిపారు.
ఇదీ చదవండి: