ETV Bharat / city

త్వరలోనే కోలుకుంటా.. కరోనా జాగ్రత్తలు మరువకండి: పవన్​ కల్యాణ్​

తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని.. తాను కోలుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ జనసేనాధినేత పవన్​ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అవసరాలకు సరిపడా ఏర్పాట్లు లేవని.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తప్పక జాగ్రత్తలు పాటించాలని కోరారు.

author img

By

Published : Apr 18, 2021, 4:06 PM IST

pawan kalyan
త్వరలోనే కోలుకుంటానన్న పవన్​ కల్యాణ్​

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​‌ సూచించారు. కరోనా కట్టడిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో ఇతర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ముందస్తు ఏర్పాట్లు అవసరం..

ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా బారినపడిన వారికి అవసరమైన మేరకు ఆసుపత్రుల్లో పడకలు, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయలేకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అందరూ కరోనా నివారణకు సహకరించండి..

మరణాలు తగ్గే విధంగా వైద్య సేవలు మెరుగుపరచి.. కొవిడ్​ కేంద్రాల సంఖ్యను పెంచాలన్నారు. అవసరాలకు అనుగుణంగా వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. కరోనా అరికట్టడానికి ప్రజలు తమ వంతు రక్షణ చర్యలు పాటించాలని పవన్​ కోరారు. అనుమానం వస్తే తప్పక పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

'వివేకా హత్య కేసులో సిట్​పై ఏబీవీవి నిరాధార ఆరోపణలు'

'భాజపా దూకుడు చూసి నిరాశలో మమత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.