New party in andhra pradesh: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉండేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జైభీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగాయని, ఉప ప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆయన విజయవాడలో మండిపడ్డారు. దళితులు నివసిస్తున్న గ్రామాల్లో ఇప్పటికీ సరైన వసతులు లేవన్నారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని వర్గాలకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. నగరంలో 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏడాదిలో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట తప్పారన్నారు.
ఇదీ చదవండి: amzath basha: "వక్ఫ్ ఆస్తుల స్వాధీనానికి... ప్రణాళికతో ముందుకెళ్తాం"