రాష్ట్ర విభజన హామీల అమలు, విభజన చట్టంలోని ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడ్డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సామాజిక కార్యకర్త రఫీ అన్నారు. విజయవాడలో జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆవిర్భావ సభలో మాట్లాడారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మారని.. 13 జిల్లాల ప్రజలకు లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం అమరావతి నిర్మాణం చేపట్టారన్నారు. సైబరాబాద్‌లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని... అమరావతి నిర్మాణం జరిగి ఉంటే మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి లభించేదన్నారు.
వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రాభివృద్ధిని నాశనం చేసిందని రఫీ విమర్శించారు. ఇప్పుడు పోలవరం నిర్మాణానికి నిధులు సందిగ్ధంలో పడ్డాయన్నారు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం మరే రాష్ట్రానికి జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఒక తాటిపైకి వచ్చి అమరావతిని, పోలవరాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: