Jagannadhastakam CD Release: వేదకాలం నుంచి ప్రపంచానికి మన దేశం అందిస్తున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆధ్యాత్మికత ఆయుధంగానే విశ్వశాంతికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి మన దేశం బాటలు వేయనుందన్నారు. శ్రీ జగన్నాథ స్వామి తత్వాలను వివరిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ కుమారుడు ప్రసేన్‌జిత్ హరిచందన్ నేతృత్వంలో తీసుకొచ్చిన ‘జగన్నాథాష్టకం’ పాటల సీడీని కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విడుదల చేశారు.
జగద్గురు ఆదిశంకరాచార్యులు పూరీ సందర్శన సందర్భంగా విష్ణురూపమైన జగన్నాథుడి లీలా వినోదాన్ని కీర్తిస్తూ.. జగన్నాథాష్టకం పఠించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం పలు కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
Registration Papers Issue: ఓటీఎస్ తిప్పలు..అదనంగా సమర్పించుకుంటేనే..