బీసీ రిజర్వేషన్ల కోతపై వైకాపాకి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలన్నారు. 59.55శాతం రిజర్వేషన్లంటూ జగన్ అందరినీ ఊహాగానాల్లో ముంచారని విమర్శించారు. బలహీన వర్గాల ఆశలపై నీళ్లు చల్లారని...బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను దారుణంగా వంచించారని దుయ్యబట్టారు. బీసీ మహిళలకు కూడా రాజకీయాధికారం దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్..... బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లలేదని ఆరోపించారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలకు గుణపాఠం చెప్పే సందర్భం వచ్చిందని యనమల వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి