జగతి పబ్లికేషన్స్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడి కంపెనీ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని జగన్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. జగతి పబ్లికేషన్స్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగాయి. వాటా ధర నిర్ణయించే అధికారం బోర్డుకు ఉంటుందని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డెలాయిట్ నివేదిక విశ్వసనీయత లేదని పెట్టుబడిదారులెవరూ ఫిర్యాదు చేయలేదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో తమను తొలగించాలని కోర్టును కోరుతూ డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయాలని జగన్ మోహన్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి నిర్ణయించారు. డిశ్చార్జి పిటిషన్లపై ఈడీ తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చారు. సీబీఐ కేసులు తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై వాదనలు వినాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగానే ఈడీ అభియోగపత్రాలు దాఖలు చేసిందన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని, తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కోరారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున రోజువారీ విచారణకు మినహాయింపు ఇవ్వాలని.. కచ్చితంగా అవసరమైతే హాజరవుతారని అయోధ్య రామిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు విచారణను సీబీఐ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఏసీబీ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జి పిటిషన్లపై అనిశా తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ వాదనలు వినిపించారు. డిశ్చార్జి పిటిషన్లు కొట్టివేయాలని.. నిందితుల ప్రమేయంపై ఆధారాలున్నాయని వాదించారు. కోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తదితరులు నిందితులుగా ఉన్న మద్యం సిండికేట్ కేసులో సాక్షుల విచారణ ప్రారంభమైంది. రోజు వారీ విచారణలో భాగంగా కేసును ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి