స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులపై దాడులు చేస్తూ... ఎలగైనా గెలవాలని అధికార పార్టీ చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజనానాథ్ విమర్శించారు. దాడుల ఘటనలపై రాజకీయ పార్టీలు, పాత్రికేయులు ఎన్ని ఆధారాలు చూపినా.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. మాచర్ల దాడి ఘటనలో నిందితుడికి మెుదట స్టేషన్ బెయిల్ ఇచ్చి, నామినేషన్ దాఖలు చేశాక.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన హింస, పట్టణ ప్రాంతాలకు చేరిందన్నారు. దాడి ఘనటలపై పోలీసులు చోద్యం చుస్తున్నారే తప్ప.. చర్యలు తీసుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు సీపీఎంతో కలిసి పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: