జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలు చూపించిన అభిమానమే స్థానిక ఎన్నికల్లోనూ చూపించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం వైకాపా పాలనలోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించి స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టారని అన్నారు.
మార్చి 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించటం ఖాయమని మంత్రి అనిల్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైకాపా కైవసం కానుందని.. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి అనిల్ కోరారు.
ఇదీ చదవండి:
'కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లవుతుంది'