రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. మరి కొందరికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి కల్పించి దిశా డీఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, తూర్పుగోదావరి ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి కల్పించారు. ఆమెను దిశా డీఐజీగా ప్రభుత్వం నియమించింది, దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగాను బాధ్యతలు అప్పగించారు.
విజయనగరం ఎస్పీగా ఎం.దీపికను నియమించారు. రైల్వే ఎస్పీగా ఉన్న సీహెచ్ విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిద్ధార్థ్ కౌశల్‌ను కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఎస్ .సతీష్ కుమార్‌ను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియమించారు. విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గరికపాటి బిందు మాధవ్‌ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. పి. జగదీష్‌ను విశాఖపట్నం జిల్లా, పాడేరు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జి కృష్ణకాంత్‌ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణకాంత్ పాటిల్‌ను తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి