AB Venkateshwar rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు సాదరస్వాగతం పలికారు. మూడేళ్ల తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించానని ఏబీవీ తెలిపారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పట్ల పూర్తి అవగాహన లేదన్నారు. సిబ్బందితో చర్చించి.. శాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా భవించడంలేదన్న ఏబీవీ.. నియామకాల విషయం ప్రభుత్వం తన ఆలోచనల మేరకు పని చేస్తుందన్నారు. అనంతరం కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. ప్రత్యేకంగా తనకు ఛాంబర్ లేకపోవడంతో.. డిప్యూటీ జనరల్ మేనేజర్ గదిలోనే ఏబీవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇవీ చూడండి: