రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కేన్సర్ ఆసుపత్రులు రాబోతున్నాయని.. అంతర్జాతీయ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. శరీరంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుంటే ప్రాథమిక దశలోనే కేన్సర్‌ను గుర్తించొచ్చని ఆయన తెలిపారు. కొవ్వు పదార్థాలు తగ్గించుకుని.. ఆకు కూరలతో ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి దరిచేరకుండా జాగ్రత్తపడొచ్చని అన్నారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టరు దత్తాత్రేయున్ని ఘనంగా సత్కరించారు. అనంతరం కేన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఇదీ చదవండి