ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఆన్లైన్లోనే చేపట్టనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటించారు. కొన్ని కళాశాలలు ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్లో చేపడుతున్నట్లు బోర్డు దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు.
ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి ఇంతవరకు బోర్డు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని.. అది వచ్చాకే ఆన్లైన్లోనే ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పటివరకు కొన్ని కళాశాలలు చేపడుతున్న ప్రవేశాలకు ఇంటర్ విద్యామండలి గుర్తింపు ఉండదన్నారు.
ఇదీ చదవండి: