బెజవాడ దుర్గమ్మ చీరల వేలంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కనకదుర్గమ్మ చీరల కౌంటర్‌ను దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ తనిఖీ చేశారు. చీరల కౌంటర్లో గంటన్నర పాటు గడిపిన కమిషనర్ చీరల ధరల వివరాలను తెలుసుకున్నారు. గోడౌన్లో చీరలు పేరుకుపోయి ఉండటంపై కమిషనర్ ఆలయ ఉద్యోగులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధిక ధరలకు చీరలు విక్రయించటం వల్ల వాటిని కొనడానికి భక్తులు ఎవరూ ముందుకు రావటం లేదని గుర్తించారు. ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సురేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కమిటీ చీరల ధరలను అంచనా వేసి ధరలు నిర్ణయించి చీరలు విక్రయించనున్నారు.
ఇదీచదవండి