ETV Bharat / city

శ్రీ మహిషాసురమర్దినిగా..బెజవాడ దుర్గమ్మ - శ్రీ మహిషాసురమర్దిని

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మ నేడు మహిషాసురమర్దినిగా భక్తులను ఆశీర్వదిస్తోంది.

శ్రీ మహిషాసురమర్దినిగా..బెజవాడ దుర్గమ్మ
author img

By

Published : Oct 7, 2019, 6:31 AM IST

Updated : Oct 7, 2019, 8:31 AM IST

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, రెండవ రోజు శ్రీ బాలా త్రిపురసుందరిదేవిగా, మూడో రోజు శ్రీగాయత్రి దేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణా దేవిగా,ఐదో రోజు లలితా త్రిముసుందరిగా ,ఆరో రోజు శ్రీ మహా లక్ష్మీ దేవిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా, ఎనిమిదోరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ రోజు మహిషాసురమర్దినిగా కొలువైంది.

శ్రీ మహిషాసురమర్దిని దేవి విశిష్టత...

సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. నవరాత్రి దీక్షలో మహర్నవమి మఖ్యమైనది. సాధకులకు నేడు మంత్రసిద్ధి జరిగే రోజని ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. ఈ మహర్నవమినాడు అమ్మను కొలిచిన వారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది.

తొమ్మిదో రోజు నైవేద్యం

దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే... నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి ఎనిమిదో రోజు అంటే.. ఆశ్వయుజ నవమి- అంటే.. ఈ రోజున అమ్మవారికి నువ్వులతో సిద్ధం చేసిన నైవేధ్యాన్ని నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.

Intro:విశ్వ శాంతిని కాంక్షిస్తూ వేద పురుష సప్త జ్ఞాన యజ్ఞం కొండ అవధాని వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు మంగళ వాయిద్యాలు వేద పఠనం స్వస్తివాచకం తో ప్రతిష్టించిన కలశం వద్ద గణపతి పూజ నిర్వహించి దహనం చేశారు యజ్ఞాన్ని వేదపండితులు ఆరని తో మధనం చేసి యజ్ఞాన్ని ప్రారంభించారు యజ్ఞం ద్రవాలను అగ్నిహోత్రానికి సమర్పించారు వేద పండితులు వేలాది మంది దేశ విదేశీ భక్తులు వేద ఘోషతో పుట్టపర్తి పులకించిపోయింది

Body:ప్రశాంతి నిలయంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సత్యసాయి ట్రస్టు వర్గాలు వేద పురుష సప్త జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు యజ్ఞాన్ని గణపతి పూజ అ కలశపూజ వేదపారాయణం సూర్యనమస్కారాలు భాగవత రామాయణ దేవి భాగవతం చండీ పారాయణం సహస్రలింగార్చన తదితర పూజా కార్యక్రమాలను అంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు

Conclusion:యజ్ఞం హోమం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్ణాహుతి ముగిస్తుంది యజ్ఞాన్ని తిలకించడానికి దేశవిదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు
Last Updated : Oct 7, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.