jagan case: వైఎస్ జగన్‌కు చెందిన కంపెనీల్లో.. ఇండియా సిమెంట్ సంస్థ ముడుపులను పెట్టుబడులుగా పెట్టిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా సిమెంట్స్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. జగన్ కంపెనీలు ప్రారంభించకుండానే ఇండియా సిమెంట్స్ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్ వాదించారు. ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం రెండింటినీ కలిపి చూసినప్పుడే కుట్ర కనిపిస్తుందన్నారు. నీరు, ఖనిజం, విద్యుత్తు వంటి ప్రజా సంపదను వ్యక్తుల లబ్ధి కోసం కేటాయించరాదని సీబీఐ వాదించింది.
ప్రస్తుత దశలో ఇండియా సిమెంట్స్ కేసును కొట్టివేయవద్దని సీబీఐ కోరింది. ఇదే కేసులో కీలక నిందితులని సీబీఐ చెప్పిన ఆదిత్యనాథ్ దాస్, ఎన్.శ్రీనివాసన్‌ను కేసు నుంచి తెలంగాణ హైకోర్టు తొలగించిందని ఇండియా సిమెంట్స్ తరఫు న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి తెలిపారు. నిబంధనల మేరకే జరిగిందంటూ మంత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.... తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి: