ETV Bharat / city

Independence Day: ఉదయం 9 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు విజయవాడ ముస్తాబైంది. త్రివర్ణ పతాకం ఎగురవేయనున్న సీఎం జగన్‌.. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖుల అధికారిక నివాసాలు.. విద్యుద్దీప కాంతులతో కళకళలాడాయి.

Independance Day
Independance Day
author img

By

Published : Aug 15, 2021, 4:15 AM IST

75వ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను సిద్ధం చేశాయి. కొవిడ్ ఆంక్షల దృష్ట్యా వేడుకలకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.

స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇందీరాగాంధీ మైదానంలో పెద్దఎత్తున ఏర్పాట్లుచేశారు. స్టేడియం లోపల, బయట తీసుకున్న భద్రతా చర్యలను డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్.. అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా దృష్ట్యా సాధారణ ప్రజలను వేడుకలకు అనుమతించడం లేదన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. విజయవాడ రాజ్‌భవన్‌, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు.. చుట్టుపక్కల రోడ్లు విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాలను మువ్వన్నెల జెండాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.

జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలి: గవర్నర్

స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకొంటున్న విషయం ప్రస్తావించారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు పునఃప్రతిష్ఠ దినంగా పంద్రాగస్టు స్ఫూర్తినిస్తుందన్నారు. శతాబ్దాల పోరాట ఫలితమే స్వాతంత్ర్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. శతవార్షిక స్వాతంత్ర దినోత్సవాల నాటికి.. నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ ఆవిష్కృతం కావాలని జనసేనాని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్వాంతంత్ర్య వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మువ్వన్నెల జెండాను రెపరెపలాడించనున్నారు.

ఇదీ చదవండి:

Governor: 'జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.