ETV Bharat / city

గెలిపించండి.. ఆంధ్రాను అమెరికా చేస్తా: పాల్​ - pavan

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​ నర్సాపురం, భీమవరం నుంచి పోటీ చేస్తానని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తెలిపారు. ఈ నెల 25న నామినేషన్​ వేస్తానన్నారు. తనకు అవకాశం ఇస్తే ఆంధ్రాని మరో అమెరికాగా మారుస్తానని హామీ ఇచ్చారు.

పవన్​కల్యాణ్​పై పోటీ చేస్తా:కేఏ పాల్​
author img

By

Published : Mar 23, 2019, 5:58 PM IST

Updated : Mar 23, 2019, 7:58 PM IST

పవన్​కల్యాణ్​పై పోటీ చేస్తా:కేఏ పాల్​
జనసేన అధినేత పవన్​కళ్యాణ్​పై పోటీ చేయబోతున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​ ప్రకటించారు.విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పాల్...ఈ నెల 25న నర్సాపురం, భీమవరంలో నామినేషన్​ దాఖలు చేస్తానన్నారు.ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇస్తే..ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని అమెరికా తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.తమ పని తీరును ప్రజలు ప్రశ్నిస్తే... పదవికి రాజీనామా చేస్తామన్నారు. అధికారాన్ని అందిస్తే.. రైతులు, డ్వాక్రామహిళలు, ఆటో, రిక్షా, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాశాంతిపార్టీ హెలికాప్టర్​గుర్తుపై వైకాపా ఆరోపణలు, ఫిర్యాదులు సరికాదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితులను వివరిస్తానని పాల్​తెలిపారు.

sample description
Last Updated : Mar 23, 2019, 7:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.