ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మభ్య పెడుతోందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయన్న ఆయన... గతంలో చంద్రబాబు 2 పడకల ఇళ్లు కట్టించారన్నారు. తెదేపా హయాంలో 5 లక్షల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చారు. మరి అక్కడ పేదలకు ఎందుకు స్థలాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు.
జగన్ బ్రాండ్స్ మద్యంపై సమాధానం చెప్పండి
రాష్ట్రంలో జగన్ బ్రాండ్స్ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. మహిళా కానిస్టేబుళ్లతో మద్యం అమ్మించిన వైకాపా సర్కార్.. తనను ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే... మమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: