ETV Bharat / city

'ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం' - రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాల పట్టాల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలే కాకుండా ఊర్లనే సృష్టిస్తోందని అధికార పార్టీ నాయకులు పేర్కొన్నారు.

House Patta Distribution
ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
author img

By

Published : Dec 30, 2020, 6:05 PM IST

అనంతపురం నియోజకవర్గంలో 5 వేల ఇంటి స్థలాల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి అన్నారు. నగరానికి అతి సమీపంలోని ఆలమూరు, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలే కాకుండా ఊర్లనే సృష్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో..

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలో 67 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో..

మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ఇంటి పట్టా అందేలా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గౌతంరెడ్డి అన్నారు. ఆత్మకూరు రూరల్ పరిధిలోని 456 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా ప్రతీ అర్హునికి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లాలో...

జిల్లాలోని చంద్రాల గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. టి.గన్నవరం, చంద్రాల గ్రామంలో అర్హులైన 344మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియని అన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కడప జిల్లా..

రైల్వేకోడూరు నియోజకవర్గంలో పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు... ఊర్లగట్టుపొడు లేఅవుట్​లో 333 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో 5300 ఇంటి పట్టాలు మంజూరు కాగా.. కోడూరు మండలంలో 2400 పట్టాలు ఇస్తున్నట్లు విప్ తెలిపారు. పట్టాలు రాని వాళ్లు ఎవరైనా ఉంటే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులుతోపాటు జిల్లా కలెక్టర్ హరికిరణ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: '25 లక్షల ఇళ్లు ఇస్తామన్నాం.. 30 లక్షలకు పైగా ఇవ్వబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.