విజయవాడ కృష్ణలంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్ హోంగార్డు తిమ్మసత్తి వెంకటేశ్వరరావు.. తన ఆత్మహత్య కారణాలను వెల్లడించిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ విభాగంలోని ఉన్నతాధికారులు తనను తీవ్రంగా వేధించేవారని సెల్ఫీ వీడియోలో వెంకటేశ్వరరావు ఆరోపించారు. 2021 ఆగస్టులో తాను హోంగార్డుగా విధుల్లో చేరి.. ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లి వచ్చేలోగా తనను టాస్క్‌ఫోర్స్‌కు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ వాపోయారు.
ఇదీ చదవండి: AP New Districts: జిల్లా కేంద్రంగా రాయచోటి.. రాజంపేట వైకాపా నేతల ఆగ్రహం