ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లోని వృత్తి విద్యా కోర్సులకు గత సంవత్సరానికి కేటాయించిన ఫీజునే 2019- 20 విద్యా సంవత్సరానికి నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ జులై 23న జీవో నెం 38ను జారీ చేసింది. కానీ... దీని అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. రుసుములను నిర్ణయించే అంశాల్లో ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ పాత్ర ఉంటుందని, ఆ అధికారం ప్రభుత్వానికి ఉండదని న్యాయవాదులు వాదన వినిపించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జీవో నెం 38 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ ఇచ్చింది. ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి... నిజం ఒప్పుకున్నందుకు జగన్కు కృతజ్ఞతలు: లోకేశ్