ETV Bharat / city

గుడివాడలో ఉద్రిక్త వాతావరణం..పోలీసుల మోహరింపు

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం

author img

By

Published : Jan 21, 2022, 9:30 AM IST

Updated : Jan 21, 2022, 1:15 PM IST

09:28 January 21

గుడివాడలో ఇవాళ తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం

కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన నేపథ్యంలో...పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఈ మేరకు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యలతో కూడిన కమిటీ...గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. అనంతరం పూర్తి నివేదికను తెదేపా అధిష్ఠానానికి ఇవ్వనుంది.

మరోవైపు గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెలుగుదేశం నేత బొండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా అని ప్రశ్నించారు. డీజీపీ వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. నేటి నిజనిర్ధరణ కమిటీ పర్యటనలో గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఇవన్నీ జరుగుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా. క్యాసినోపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొడాలి నానిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరుగుతుంటే పట్టించుకోలేదు. కె కన్వెన్షన్‌లో జరిగినట్లు ఆధారాలతో సహా చూపిస్తాం. తూతూమంత్రంగా విచారణ జరిపితే న్యాయపోరాటం చేస్తాం - బొండా ఉమ, తెదేపా నేత

ఇదీచదవండి: employees protest: పీఆర్సీపై కదం తొక్కిన ఉద్యోగులు.. కలెక్టరేట్​ల ముట్టడి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.