సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సామ్యాద్రి శేఖర్ బోస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో రూ.241కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణపై సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన శేఖర్ బోస్ బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు.
ఇదీచదవండి.