రాష్ట్రంలోని పాఠశాలలు పునఃప్రారంభించడానికి ముందే ఉపాధ్యాయులందరికి కొవిడ్ టీకా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 45 ఏళ్లు పైబడిన 60 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే టీకా తీసుకున్నారన్నారు. ఆగస్టు 16న పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈలోపు మిగిలిన ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి..
CM ON JAWAN: అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి