ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సొంతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సమస్య శాశ్వత పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం ఏమిటి ..? తాగు నీటి సరఫరాకు కేటాయించిన రూ.700 కోట్లు ఏ మేరకు ఖర్చు చేశారు.. తదితర వివరాల్ని కోర్టు ముందుంచాలని ఆదేశించింది. విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని.. న్యాయవాది కె.సింహాచలం 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. 'ప్రభుత్వం తాగునీటి సరఫరాకు రూ.700 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలి' అన్నారు.
ఇదీ చదవండి: