ETV Bharat / city

HC: తెదేపా మహిళా నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ - విజయవాడ వార్తలు

HIGH COURT: తెదేపా మహిళా నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి జగన్​, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ANTICIPATORY BAIL TO TDP LEADERS
ANTICIPATORY BAIL TO TDP LEADERS
author img

By

Published : Dec 10, 2021, 4:58 AM IST

ANTICIPATORY BAIL TO TDP LEADERS: సీఎం, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో నలుగురు తెలుగుదేశం మహిళా నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వారిపై ఉన్న ఆరోపణలేమిటి..? వారి ఇళ్లలో పోలీసులు ఎందుకు సోదాలు నిర్వహించాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశించింది.

విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై.. టి.స్వప్న, పి. విజయశ్రీ, కె.సి. జానకి, ఎస్​. తేజస్విని విలేకరుల సమావేశంలో సీఎం, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

FASHION SHOW: ఆకట్టుకున్న మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థుల ఫ్యాషన్ షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.