ETV Bharat / city

Prabhas on Cinema tickets GO : సినిమా టికెట్ల ధరలపై ప్రభాస్ ఏమన్నాడంటే... - సినిమా టికెట్ల వివాదం ప్రభాస్ స్పందన

Prabhas on Cinema tickets GO: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై అగ్ర కథానాయకుడు ప్రభాస్ స్పందించారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం జీవో విడుదల చేస్తే చాలా సంతోషిస్తాన్నారు.

Prabhas
Prabhas
author img

By

Published : Mar 7, 2022, 4:37 PM IST

Prabhas on Cinema tickets GO: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై నటుడు ప్రభాస్ స్పందించారు. ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై జీవో విడుదల చేస్తే చాలా సంతోషిస్తాన్నారు. రాధేశ్యామ్ విడుదలకు ముందే ఆ జీవో ఇస్తే ఇంకా సంతోషిస్తానన్నారు. 'రాధేశ్యామ్​' మూవీ ప్రమోషన్​ ప్రోగ్రాంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Prabhas Radheshyam release: రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన పాన్‌ ఇండియా లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకులు. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరులో ఏది గెలిచిందన్న ఆసక్తికరం. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇదీ చదవండి: టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.