ETV Bharat / city

అంత్యక్రియలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

ఆపదలో ఉన్నోళ్లకు అండగా నిలిచేందుకు సిరిసంపదలు అవసరం లేదు.. ఆదుకోవాలనే ఆలోచన ఉంటే చాలు.. అదే నిరూపిస్తున్నారు విజయవాడ యువత. కరోనా సమయంలో బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు. అంతిమ సంస్కారాలు మెుదలు అవసరమైన సేవలను అందించిన హెల్పింగ్ హ్యాండ్స్‌ సంస్థ.. కొవిడ్ సెకండ్ వేవ్‌లోనూ సేవలకు సై అంటోంది.

అంత్యక్రియాలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

author img

By

Published : Apr 20, 2021, 6:22 PM IST

అంత్యక్రియాలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

కరోనా ఈ పేరు వింటే చాలు ఆమడ దూరం వెళతారు. కొవిడ్​తో మరణిస్తే అందరూ ఉన్నా అనాథల్లా మృతదేహానికి అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది. వైరస్ బారిన పడిన బాధితులకు, మరణించిన కుటుంబాలకు మేమున్నామంటూ ముందుకు వస్తుంది హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ. కరోనా మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేస్తూ.. రక్త సంబంధీకులుగా మారుతున్నారు.

'ఆసుపత్రిలో అన్నదానం చేస్తున్నాం .. కరోనాతో ఓ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని తల్లి ఆసుపత్రి బయట కూర్చుని కుమారుని ఆరోగ్యం ఎలా ఉంది ? అన్నం తిన్నాడా లేదా ? అని తెలియక విలవిల్లాడిపోతుంది. ఆమె ఆకలితో అలమటిస్తున్నా.. అన్నం తినకుండా కన్నపేగు కోసం కన్నీరుపెడుతుంది. మరొకరు తమ బంధువు కరోనాతో మృతి చెందాడు. దహనసంస్కారాలు చేయాలంటే ఊళ్లో రానివ్వరు. సాంప్రదాయంగా అంత్యక్రియలు జరిపేందుకు అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నన్ను కదిలించాయి. మా సంస్థ ద్వారా వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా.. కరోనాతో మృతి చెందిన వారికి సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాను' హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్ చెబుతున్న మాటలివి.

8 ఏళ్లుగా కన్నీళ్లు తుడుస్తూ..

హెల్పింగ్ హ్యాండ్స్! గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ. దాదాపు 8 ఏళ్లుగా కష్టాల్లో ఉన్న నిరుపేదల కన్నీళ్లు తుడుస్తూ వారికి అవసరమైన కనీస అవసరాల్ని తీర్చుతోంది. ఆకలితో ఆలమటిస్తున్న వారికి ఆహారం, ఆరోగ్యం సరిగా లేని వారికి వైద్య సేవలు అందిస్తూ సేవకూ నిర్వచనంగా నిలుస్తోంది. మానవత్వా న్ని ప్రశ్నార్థకం చేసిన కరోనా కష్టకాలంలోనూ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.

విజయనగరంలో ఓ ఘటన

సేవ చేయాలనే ఆలోచన ఉన్న యువతను వాలంటీర్లుగా చేర్చుకుని..ఎప్పటికప్పుడూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు హెల్పింగ్ హ్యాండ్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్‌. విజయవాడకు చెందిన ఈ యువకుడు.. విజయనగరంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు కార‌ణమైంది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు.. జ్వరానికి ఔషధాలు కొనలేకపోవటంతో ఏజెన్సీకి చెందిన ఓ చిన్నారి మరణించింది. ఆ చిన్నారి మరణంతో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో 8 యేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించానని వెంకట్ తెలిపారు.

కొవిడ్ బాధితులకు ఆహారం సరఫరా

కనీస అవసరాలకైనా నోచుకోని అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్‌కు గతేడాది కరోనా సంక్షోభం అనేక సవాళ్లు పరిచయం చేసింది. సేవా కార్యక్రమాల నిర్వహణకు పరీక్ష పెట్టింది. సభ్యులంతా భయాన్ని పక్కనపెట్టి..పాజిటివ్ వచ్చి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ సేవలందించారు . దాదాపు 300 మందికి ఆహారం సరఫరా చేశారు. సమాజం అంటరానివారిగా చూస్తున్న వారిలో మానసిక స్థైర్యం నింపారు.

విజయవాడ టూ విజయనగరం

లాక్‌డౌన్ సమయంలో ప్రత్యేక వాహనం తీసుకుని విజయవాడ నుంచి విజయనగరం వరకు వెళ్లి పేదవారికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా రెండో దశలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్పింగ్ హ్యాండ్స్‌ సభ్యులు మళ్లీ బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. విజయవాడ నగరంలో కరోనా సోకి హోమ్ ఐసోలేషన్​లో ఉన్నవారికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా బాధితులకు సేవల్ని అందిస్తున్నారు.

సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు

దేశమంతా స్తంభించిపోయిన పరిస్థితుల్లో నిరుపేదలకు ఆహారం సరఫరా చేయడమే కాక.. ఆ సమయంలో అతిపెద్ద సవాలుగా మారిన అంతిమ సంస్కారాలపైనా దృష్టి పెట్టింది హెల్పింగ్ హ్యాండ్స్‌. కరోనా తీవ్రత అధికంగా ఉండి మరణాలు నమోదు అవుతున్న తరుణంలో మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం సేవా సంస్థ సభ్యుల్ని కలిచివేసింది. సంప్రదాయాల ప్రకారం వారే అంత్యక్రియలు చేయటం ప్రారంభించారు.

లాక్‌డౌన్ సమయంలో 67 కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు హెల్పిండ్ హ్యాండ్స్ సభ్యులు. ఆంక్షలు, స్థానికుల వ్యతిరేకత నడుమ.. చెరువులు, పొలం గట్టుల మధ్య మృతదేహాలు మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. సాధారణ సేవా కార్యక్రమాలు చేయటం కంటే.. కఠినమైన కొవిడ్ పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..హెల్పింగ్ హ్యాండ్స్‌ సభ్యులు.

కష్టంలో ఉన్న వారికి అండగా ఉండటమే లక్ష్యం అంటున్న హెల్పింగ్‌హ్యాండ్స్ సభ్యులు.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్న ఫ్లాట్‌కు తాళం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.