ETV Bharat / city

Cyclone Asani: తీవ్ర తుపానుగా 'అసని'.. కోస్తాంధ్రలో వర్షాలు - ap rans updates

Cyclone Asani: పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన అసని తుపాను.. రేపు సాయంత్రానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుపాను ప్రభావంతో రేపు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

heavy rains to land in andhra pradesh on tuesday
ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన
author img

By

Published : May 9, 2022, 10:12 AM IST

Updated : May 9, 2022, 8:34 PM IST

Cyclone Asani: విశాఖకు ఆగ్నేయంగా 450 కిలో మీటర్ల దూరంలో పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అసని' తుపాను.. రేపు సాయంత్రానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుపాను ప్రభావంతో రేపు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు ఉదయం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చాక దిశ మార్చుకునే సూచనలు ఉన్నాయని.. అనంతరం క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేశారు. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేశారు.

మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. తుపాను నేపథ్యం స్థానిక ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

వర్షాలు: తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు. చాలా చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్లాలలోనే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతుల తంటాలు పడ్డారు. రావులపాలెంలో ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి రెండు ఆర్టీసీ బస్సు అద్దాలు ఊడిపోయాయి. సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి కాకినాడ వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రైవర్ ముందు అద్దం ఊడి కింద పడిపోయింది. రావులపాలెం డిపోకు చెందిన మరో బస్సు అద్దం ఊడి పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం రాశులు కళ్లాలలోనే ఉండగా ...రైతులు తడవకుండా జాగ్రత్తపడ్డారు.

ఇదీ చదవండి:

Last Updated : May 9, 2022, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.