HC on ordinance for special invitees to TTD board: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో.. కల్యాణదుర్గం తెదేపా ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు పిటిషన్ దాఖలు చేశారు. తితిదే ప్రత్యేక ఆహ్వానితుల కేసులో స్టే కొనసాగించిన హైకోర్టు.. ఆర్డినెన్స్ వచ్చినా కోర్టు ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. కోర్టు ఉత్తర్వులు అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెచ్చారని.. పిటిషనర్ తరుపు న్యాయవాదులు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉంది
తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై భాజపా నేత భానుప్రకాశ్, మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసురావడంపై వాళ్లు మరోసారి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.