బెయిల్పై బయటకొస్తే పిటిషనర్కే నష్టం జరిగే అవకాశం ఉంది కదా అని.. జడ్డి రామకృష్ణ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు వ్యాఖ్యానించారు. ఇదే విధంగా పిటిషనర్ వ్యవహరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తవా అని పేర్కొన్నారు. కొంతకాలం సురక్షిత కస్టడీలో ఉండటం ఉత్తమం అన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. బెయిలు మంజూరు విషయంలో న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు ముందు ఉంచడానికి స్వల్ప సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో అరెస్టుయిన జడ్జి రామకృష్ణ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రిపై పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం నేరం కింద రావన్నారు. ఏప్రిల్ 15న జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారని.. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారని కోర్టు దృష్టికి తెసుకెళ్లారు.
పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి వాదిస్తూ.. పిటిషనర్ పబ్లిక్ సర్వెంట్ అయిఉండి టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్ధం అన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్లో ఉంటూ అన్ని అలవెన్స్ పొందుతున్నారన్నారు. బెయిలు మంజూరు చేస్తే ఆతను మీడియా ముందుకు వెళ్లకుండా, చర్చల్లో పాల్గొనకుండా నిలువరించాలని కోరారు. అలా ఆంక్షలు పెట్టడం అంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు.
ఇదీ చదవండి..