ETV Bharat / city

Need Help: దయనీయం అతడి జీవితం.. సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం - help for handicapped

బిడ్డలను ఎత్తుకుని బడికి తీసుకెళ్లాల్సిన భర్తను చంకెనెత్తుకుని.. కుటుంబబాధ్యతను భూజాన వేసుకుని కష్టాల నావను ఈదుతోంది ఆ ఇల్లాలు. కాళ్లు, చేతులు, నడుము కదలలేని స్థితిలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు.. వీళ్లందరి బాగోగులు చూసే భార్య. దయనీయమైన స్థితిలో బతుకీడుస్తున్న వీరి కుటుంబాన్ని ఆదుకునే ఆపన్న హస్తం కోసం దీనంగా.. ఇంటిల్లిపాది వేచి చూస్తోంది.

handicapper ravi requested to help
సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం
author img

By

Published : Oct 4, 2021, 3:54 PM IST

సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్​ తండాకు చెందిన రవిది ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు బిందు(8), మహేష్​(6). రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్​ చంపాపేటలోకి నెహ్రూనగర్​కు చేరుకున్నారు.

పదేళ్ల వయసు వరకు అందరి మాదిరిగానే ఉన్న రవికి క్రమంగా.. కాళ్లు, చేతులు, నడుము వంకర్లు తిరిగిపోయాయి. రవిని ఇష్టపడి పెళ్లాడిన పార్వతి భర్తను చంటిబిడ్డలా చూసుకుంటోంది. ఎక్కడికి వెళ్లాలన్నా.. 36ఏళ్ల రవిని చేతులతో మోసుకేళ్లాల్సిన పరిస్థితి. పిల్లలతో పాటు భర్తను కూడా పార్వతి.. ఓ చంటిబిడ్డలా చూసుకుంటోంది. ప్రస్తుతం.. కోఠి, ఎల్బీనగర్​ తదితర కూడళ్లలో భిక్షాటన చేస్తూ.. రవి బతుకీడుస్తున్నాడు.

సాయం చేయండి..

"దాదాపు 27 ఏళ్లుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నా. రెండు చేతుల్లో ఎముకలు లేవు. పట్టుకోవాలన్నా స్థోమత ఉండదు. కాళ్లు చచ్చుబడిపోయాయి. నా భార్య లేకపోతే నేను లేను. నా వల్ల నా భార్యకు ఎవరూ పని కూడా ఇవ్వట్లేదు. ఉండేదుకు కనీసం ఇల్లు లేదు. నాకు వచ్చే రూ.3000 పింఛను కిరాయి కట్టుకునేందుకు మాత్రమే సరిపోతోంది. భిక్షాటన చేస్తే వచ్చే 150-200 రూపాయలతో ఇల్లు గడుస్తోంది. దయుంచి.. కనీసం నా పిల్లల ముఖాలు చూసైనా.. మనసున్న మారాజులు మాకు సాయం చేయండి." - రవి, బాధితుడు.

  • 9553455593- రవి ఫోన్​ నెంబర్​

ఇదీ చూడండి:

SUICIDE ATTEMPT: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.