నూతన ఇసుక విధానం రూపకల్పనపై మంత్రుల కమిటీ సమావేశమయ్యింది. ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నానిలు హాజరయ్యారు. సీఎం జగన్ అదేశాలతో ఇసుక పాలసీలో మార్పులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించారు.
వినియోగదారులకు ఇసుక సరఫరాలో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. ఇసుక విధానంలో మార్పులు చేయాలని సోమవారం మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నూతన ఇసుక విధానం రూపకల్పనలో.. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
ఇవీ చదవండి...
లేపాక్షి, ఆప్కో ఉత్పత్తుల వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం