ETV Bharat / city

విద్యా నియంత్రణ చట్టాన్ని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు

పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం 2019ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు నేటినుంచి నియమ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది.

govt_order_passed_about_education_act
author img

By

Published : Aug 19, 2019, 7:18 PM IST

పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం-2019ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి చట్టంలోని నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరిగిపోయిన ఫీజుల నియంత్రణ, సౌకర్యాల లేమి తదితర అంశాలపై చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. అసెంబ్లీలో దీన్ని ఆమోదించిన అనంతరం ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.