రాష్ట్రవ్యాప్తంగా 104 ఆంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 అంబులెన్సు వాహనాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.89.27 కోట్లతో.. 539 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు వ్యయంతో పాటు.. వీటి నిర్వహణ కోసం ఏడాదికి 75.82కోట్లవ్యయం అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వైద్యుడి విధానం అమలు చేసేందుకు.. ఈ వాహనాలు ఉపకరిస్తాయని భావిస్తోంది. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేయాల్సిందిగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓను.. అదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:
ARREST: తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు