ETV Bharat / city

విద్యార్థుల మృతిపై గవర్నర్ సంతాపం - భూదేవిపేట శివారులోని పెదవాగులో విషాదం

పశ్చిమ గోదావరి జిల్లా భూదేవిపేట శివారు పెదవాగులో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటనపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. విద్యార్దుల మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు.

governor condolence  on velerupadu incident
విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ సంతాపం
author img

By

Published : Oct 28, 2020, 8:42 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో భూదేవిపేట శివారులోని పెదవాగులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికారు.

గ్రామానికి చెందిన పలు కుటుంబాలతో వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లిన విద్యార్ధులు... సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగగా ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. అనంతరం యువకుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.

సంబంధిత కథనం:

వనయాత్రలో విషాదం.. వాగులో పడి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.