దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుందని... కరోనా వంటి సందర్భాలు, విపత్తులను జయించటానికి.. శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించటం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆనందోత్సాహాలతో చేసుకునే ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వెంకటేశ్వరుడి ఆశీర్వాదాలు లభించాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ కోరారు.
ఇవీ చదవండి..