మానవ అక్రమ రవాణాను ఎదుర్కొనే క్రమంలో ప్రజ్వల సంస్థ రూపొందించిన ఐదు చేతి ప్రతులు ఉపయోగకరంగా ఉంటాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అక్రమ రవాణాను నివారించడమే కాక, సమస్యను పరిష్కరించడంలో మార్గదర్శకత్వం వహిస్తాయని చెప్పారు.
జ్యుడీషియల్ ఆఫీసర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, లేబర్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీ సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు సహాయకారిగా ఉంటాయని తెలిపారు. 'హ్యాండ్ బుక్ ఆన్ కౌంటర్ హ్యూమన్ ట్రాఫికింగ్' పేరిట వీటిని తీర్చి దిద్దటం మంచి ప్రయత్నమన్నారు. ఈ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:
సరిహద్దుల్లో ఓటు వేయకుండా ఆంక్షలు.. పోలీసులకు ఎదురెళ్లి ఓటు వేసిన గిరిజనులు