ETV Bharat / city

చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది: గవర్నర్ భిశ్వభూషణ్​ - నేతన్న సమస్యలపై గవర్నర్​కు విన్నపించుకున్న ఆప్కో ఛైర్మన్

Governor Bishwabushan on Handlooms: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు చిహ్నాలుగా నిలుస్తాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగవెంకట మోహనరావు.. రాజ్​భవన్​లో గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Governor Bishwabushan on Handlooms
Governor Bishwabushan on Handlooms
author img

By

Published : Mar 17, 2022, 9:16 PM IST

Handloom: స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులూదిన చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగవెంకట మోహనరావు.. రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించారు.

చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఎస్​టీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆప్కో ఛైర్మన్‌ విన్నవించారు. వ్యవసాయ తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి జీఎస్​టీ గొడ్డలిపెట్టుగా మారిందని.. కేంద్ర ప్రభుత్వం దానిని మినహాయించేలా సహకరించాలని గవర్నర్​కు విన్నవించుకున్నారు.

నేతన్న నేస్తం పేరిట రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతీ చేనేతకు సహాయం అందుతోందని.. నూతన డిజైన్లతో యువతను ఆకర్షించేలా ఆప్కో వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. గన్నవరం, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలలో సైతం ఆప్కో కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు గవర్నర్​కు వివరించారు.

ఇదీ చదవండి:

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.