employees transfers : వైద్యారోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పిస్తూ...ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి 28 వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోంది. మళ్లీ మార్చి 1 తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7లోగా ఉద్యోగులు సంబంధిత అధికారులకు బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేయాలని సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 28 నాటికి ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీ తప్పనిసరని... ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకేచోట 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం అభ్యర్ధించే అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియ., ప్రాధాన్యతలను పూర్తిగా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని స్ఫష్టం చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి