దేశ గ్రామీణ ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంలో సహకార వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. స్థానిక మానవ వనరులను ఏకీకృతం చేయడానికి, గ్రామీణ భారత అభివృద్ధికి శక్తినిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేస్తోందని వెల్లడించారు. పుణెలోని వైకుంత్ మెహతా జాతీయ సహకార నిర్వహణ సంస్థ స్నాతకోత్సవంలో గవర్నర్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం అగ్రి- బిజినెస్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోందని, ఈ రంగానికి నైపుణ్యమున్న మానవ వనరులు అవసరమని చెప్పారు. దేశంలో పాల విప్లవానికి.. పాడి సహకార సంస్థలు కారణమయ్యాయని, ఇఫ్కో, అమూల్ వంటి సంస్థలు సహకార రంగంలో పెద్ద విజయగాథలుగా మారాయని వివరించారు. నూతన వ్యవసాయ చట్టం-2020తో దేశంలో సంస్కరణలు వచ్చిన దృష్ట్యా... వైకుంత్ మెహతా సంస్థ పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి: