మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని.. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ‘సుపరిపాలన దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకుంటూ, దేశ ప్రజల ప్రియమైన నాయకుడికి నివాళి అర్పిస్తూ.. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
సుపరిపాలన పట్ల పౌరులకు స్పృహ కలిగించడమే ఈ దినోత్సవ లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కాని, సమాజంలో కాని అవినీతికి చోటు లేదని ‘సుపరిపాలన దినోత్సవం’ మనకు గుర్తుచేస్తుందని వివరించారు. ఈ దినోత్సవం ప్రతి ఒక్కరికీ ఆనందం, గౌరవం, సమాన అవకాశాలతో జీవించే హక్కు ఉందని సూచిస్తుందన్నారు.
ఇదీ చదవండి: