క్రమం తప్పకుండా యోగా సాధన చేయటం.. ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 సందర్భంగా.. ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రాజ్‌భవన్‌లో గవర్నర్ విడుదల చేశారు. యోగా మన దేశంలో ఉద్భవించిన 5,000 సంవత్సరాల నాటి పురాతన సంప్రదాయమని అన్నారు. ఇది శరీరం, మనస్సు సామరస్యాన్ని సాధించడానికి.. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేయటానికి సహకరిస్తుందన్నారు. సమాజం కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటుందని, క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతామన్నారు.
కుటుంబాల శ్రేయస్సుకు సహాయపడే యోగాను.. జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇంటి వద్దే సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి:
Anandayya Medicine: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. జులై 1కి వాయిదా