ETV Bharat / city

Governer: ప్రధాని చొరవతోనే పైక్ తిరుగుబాటు గుర్తింపు: గవర్నర్ బిశ్వభూషణ్

భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకను పురస్కరించుకుని.. శనివారం ఫిక్కీ భువనేశ్వర్ శాఖ నిర్వహించిన వెబినార్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా.. బుక్సి జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలను గవర్నర్ వివరించారు. ప్రధాని మోదీ చొరవతోనే.. పైక్ తిరుగుబాటు గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.

governer bishwabushan participates in ficci webinar
ప్రధాని చొరవతోనే పైక్ తిరుగుబాటు గుర్తింపు: గవర్నర్ బిశ్వభూషణ్
author img

By

Published : Sep 5, 2021, 12:38 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో.. జాతీయ స్థాయిలో పైక్ తిరుగుబాటు గుర్తింపు పొందిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan) అన్నారు. భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకను పురస్కరించుకుని.. శనివారం ఫిక్కీ((FICCI-Federation of Indian Chambers of Commerce and Industry)భువనేశ్వర్ శాఖ నిర్వహించిన వెబినార్‌లో.. వర్చువల్ విధానంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బుక్సి జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలను గవర్నర్ వివరించారు. 1997 లో ఒడిశాలోని జనతా పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు.. తాను సాంస్కృతిక శాఖ నిర్వహించానని, 8 సంవత్సరాల పాటు కొనసాగిన పైక్ తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర యుద్ధంగా గుర్తించటానికి చొరవ తీసుకున్నామని తెలిపారు.

గజపతి మహారాజు కమాండర్-ఇన్ - చీఫ్ బుక్సీ జగబంధు బ్రిటిష్ పాలకుల అణచివేత చర్యలను సహించలేకపోయాడని, రాష్ట్రంలోని పైకా అధిపతులందరినీ ఒకచోట చేర్చి జన విప్లవాన్ని ప్రారంభించారన్నారు. 1817 మార్చి 29న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒడిశాలోని సాధారణ ప్రజలు చేసిన పోరు మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి దారితీసిందన్నారు. పైక్ తిరుగుబాటు ఒడిశాలోని సాధారణ ప్రజలు చేసిన ప్రజా యుద్ధమన్నారు.

వెబినార్‌లో మాజీ ఎంపీ డాక్టర్‌ దిలీప్‌ టిర్కీ ప్రారంభోపన్యాసం చేశారు. భువనేశ్వర్‌ ఫిక్కీ (ఎఫ్‌ఎల్‌వో) చైర్‌పర్సన్‌ సునీతా మొహంతి, వైస్‌ చైర్‌పర్సన్‌ నమృత చాహల్, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్పీ సిసోడియా, వెబినార్‌లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: TEACHERS DAY: కరోనా వల్ల గురుపూజోత్సవాలు రద్దు.. ఆదేశాలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.