రాష్ట్రం ఆర్థిక ఉగ్రవాది చేత చిక్కి దివాళా దిశగా సాగుతోందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన లక్షా 27 వేల కోట్ల అప్పులు పేలపిండిలా గాలి పాలయ్యాయని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో మునిగి తేలుతూ..., కోట్లకు పడగలెత్తుతున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల పేరుతో రూ.4వేల కోట్లు కాజేసినా ముఖ్యమంత్రి...నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీబీ నిధులు కాజేయడానికి ఓ మంత్రే ప్రయత్నించారన్న అయన...మీడియా ద్వారా వ్యవహారం బయటకు రావటంతో టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. అనధికార ముఖ్యమంత్రి సజ్జల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
మాట తప్పను-మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి...,నేడు తెదేపా ఎమ్మెల్యేలను ఎందుకు ప్రలోభపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారని నిలదీశారు. వారితో రాజీనామా చేయించి తనపార్టీ తరపున గెలిపించుకునే ధైర్యం లేకనే ఇలా చేస్తున్నారన్నారని ఆక్షేపించారు. రాజధానిలో జరిగేది రైతుల ఉద్యమం కాదంటున్న వైకాపా నేతలు...మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని డిమాండ్ చేశారు. వారితోపాటు తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. ఎవరేమిటో తేల్చుకోవడానికి..ప్రజల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
ఇదీచదవండి