ETV Bharat / city

రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది

పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ సామగ్రి తరలించామన్న ఆయన... పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు.

author img

By

Published : Feb 12, 2021, 3:53 PM IST

Updated : Feb 12, 2021, 7:24 PM IST

రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరకకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. 13 జిల్లాలు, 18 రెవెన్యూ డివిజన్​లు, 167 మండలాల్లోని 3,328 గ్రామ పంచాయతీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా..539 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని స్పష్టం చేశారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నామినేషన్లు దాఖలు కానందున రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగటం లేదన్నారు. మిగిలిన 2,787 సర్పంచ్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుందని... ఈ పంచాయతీలకు 7 వేల 507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. 33,570 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా...వీటిలో 12, 604 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయని కారణంగా ఎన్నికలు జరగడం లేదన్నారు. మిగిలిన 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుందని..,ఈ మెుత్తం వార్డులకు 44,876 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్..,4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారన్నారు. అనంతరం అదేరోజు ఉప సర్పంచి ఎన్నిక పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

29 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలు...

రెండో దశ ఎన్నికకు 29,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ద్వివేది స్పష్టం చేశారు. వీటిలో 5,480 సున్నిత పోలింగ్ స్టేషన్లు, 4,181 అతి సున్నిత పోలింగ్ స్టేషన్లు గుర్తించినట్లు తెలిపారు. 12,092 మందిని స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులను, 3,427 మందిని స్టేజ్-2 రిటర్నింగ్, 1,370 మందిని అసిస్టెంట్ రిటర్నింగ్, 33,835 మందిని ప్రిసైడింగ్ అధికారులను నియమించామన్నారు. మెుత్తంగా 47, 492 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

551 జోనల్ అధికారులను, 1,228 రూట్ అధికారులను నియమించామన్నారు. పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 2,606 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు అవసరమైన సంఖ్యలో సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నికలు జరగనున్న డివిజన్లు...

రేపు శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్​లలో 10 మండలాల్లో పంచాయతీ రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం రెవెన్యూ డివిజన్​​లోని 15 మండలాలు, విశాఖజిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్​లోని 10 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్​లలోని 14 మండలాల్లో పోలింగ్ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాలు, కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్​లోని 9 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

గుంటూరు జిల్లా నరసారావుపేట రెవెన్యూ డివిజన్​లోని 11 మండలాలు, ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజన్​లోని 14 మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్​లోని 10 మండలాలు, కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్​లలోని 13 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్​లోని 19 మండలాల్లో, కడప జిల్లాలో కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో, చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్​లోని 17 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీచదవండి

పంచాయతీ ఎన్నికలపై ఒడిశా పిటిషన్.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

Last Updated : Feb 12, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.