ETV Bharat / city

విమానాశ్రయం రన్​ వే విస్తరణకు భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళన - కృష్ణా జిల్లా వార్తలు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్​ వే విస్తరణకు భూమిలిచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. గత ప్రభుత్వం ఆర్​ అండ్ ఆర్ కింద గన్నవరం మండలంలోని దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో 50 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు 5 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఆ ప్యాకేజీని రద్దు చేసి, సెంటున్నర స్థలాన్ని ఇస్తానని ప్రకటించింది. దీంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు.

నిర్వాసితులు ఆందోళన
నిర్వాసితులు ఆందోళన
author img

By

Published : Jul 2, 2020, 1:03 PM IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్​ వే విస్తరణకు గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 50 ఎకరాల భూమిని సేకరించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ప్యాకేజీని రద్దు చేసి 5 సెంట్ల స్థలానికి బదులు సెంటున్నర ఇస్తామని చెప్పడంతో బాధితులు ప్రభుత్వం సేకరించిన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. 5 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద సుమారు 300 కుటుంబాల నుంచి గత ప్రభుత్వం భూమిని సేకరించింది.

ఇదీ చదవండి : 'జగన్ కేబినెట్​ మంత్రులంతా డమ్మీలు '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.